Share News

నా భూమిని నిషేధిత జాబితాలో పెట్టడం చెల్లదు

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:58 AM

తన భూమిని నిషేధిత జాబితాలో పెట్టడం చెల్లదని, ఈ ఏడాది సెప్టెంబరు 23న జారీచేసిన జీవో 134ను కొట్టేయాలని పేర్కొంటూ మాజీ ఆంగ్లో ఇండియన్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

నా భూమిని నిషేధిత జాబితాలో పెట్టడం చెల్లదు
Boiguda Land Dispute

134 జీవో కొట్టేయండి.. హైకోర్టులో స్టీఫెన్‌సన్‌ పిటిషన్‌

తన భూమిని నిషేధిత జాబితాలో పెట్టడం చెల్లదని, ఈ ఏడాది సెప్టెంబరు 23న జారీచేసిన జీవో 134ను కొట్టేయాలని పేర్కొంటూ మాజీ ఆంగ్లో ఇండియన్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ బోయిగూడలో తన పేరిట ఉన్న 1936 చదరపు గజాల స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చారని, రాజకీయ కుట్రలో భాగంగానే జీవో 134 జారీ చేశారని ఆరోపించారు. ఈ పిటిషన్‌ బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శాంకోషీ, జస్టిస్‌ చలపతిరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను సంబంధిత రోస్టర్‌ కలిగిన సింగిల్‌ జడ్జి ఎదుట విచారణ కోసం ఉంచాలని డివిజన్‌ బెంచ్‌ రిజిస్ర్టీని ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:58 AM