‘శ్రీచైతన్య’ చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా భారీ రక్తదాన శిబిరం
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:27 AM
శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్షీబాయి జన్మదినం సందర్భంగా శనివారం భారీ రక్తదానం శిబిరం నిర్వహించారు.
4 రాష్ట్రాల్లో 2,968 మంది సిబ్బంది రక్తదానం
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్షీబాయి జన్మదినం సందర్భంగా శనివారం భారీ రక్తదానం శిబిరం నిర్వహించారు. శ్రీచైతన్య విద్యాసంస్థలు, ఎన్టీఆర్ ట్రస్టు, న్యూసిటీ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటకలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్స్, కళాశాలలకు చెందిన 2,968 మంది సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధిస్తూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు... విద్యతోపాటు సామాజిక సేవలోనూ ఎల్లప్పుడూ ముందుంటున్నాయని ఝాన్సీ లక్ష్మీబాయి పేర్కొన్నారు.
41 ఏళ్ల క్రితం డాక్టర్ బీఎస్ రావు నాటిన చిన్న విద్యావిత్తనం నేడు మహా వృక్షంగా ఎదిగి ప్రపంచం గర్వించే మేధావులను అందించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. తన జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. శ్రీచైతన్య విద్యాసంస్థలు ఈ స్థాయికి చేరుకోవడం వెనక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. రక్తదాన శిబిరాల్లో వందలాది మంది స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషంగా ఉందని శ్రీచైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ బొప్పన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీమ బొప్పన, టి.నాగేంద్రకుమార్ పాల్గొని రక్తదానం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News