తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:14 PM
విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. వారికి వేసవి సెలవులు ప్రకటించేశారు. దీంతో తల్లిదండ్రులతో కలిసి వారంతా ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. అలాగే పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో రవాణా వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.
విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. వారికి వేసవి సెలవులు ప్రకటించేశారు. దీంతో తల్లిదండ్రులతో కలిసి వారంతా ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. అలాగే పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో రవాణా వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రైళ్లలో సైతం రెండు నెలల క్రితమే బర్త్‌లన్ని నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదగా పలు ప్రత్యేక రైల్వే సర్వీసులను నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే కొన్ని రైల్వే సర్వీసులను పొడిగించినట్లు వివరించింది. ఈ ప్రత్యేక రైళ్లతోపాటు పొడిగించిన రైల్వే సర్వీస్ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఏ ఏ మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయంటే..?
చర్లపల్లి-తిరుచానూరు, తిరుపతి-అకోలా, కాచిగూడ-తిరుచానూరు, తిరుపతి- చర్లపల్లి, నాందేడ్-తిరుచానూరు, చర్లపల్లి-తిరుచానూరు, సికింద్రాబాద్-అనకాపల్లి, తిరుపతి-నరసాపూర్, నాందేడ్-ధర్మవరం, చర్లపల్లి-నరసాపూర్, కాకినాడ టౌన్- లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-కాకినాడ టౌన్, జల్నా-తిరుచానూర్, చర్లపల్లి-అనకాపల్లి, సికింద్రాబాద్-అనకాపల్లి, కాకినాడ టౌన్- మైసూర్, చర్లపల్లి- భువనేశ్వర్ న్యూ, తిరుపతి-పందార్‌పూర్, హైదరాబాద్-బెళగావి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతుంది.
ఈ రైలు సర్వీసులు పొడిగింపు..
రైలు నెం: 06557 (ఎస్ఎంవీటీ బెంగళూరు- సంత్రాగాచి.. ఏప్రిల్ 10 నుంచి 24 వరకు శుక్రవారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
రైలు నెం: 06558 (శాంత్రగాచి- బెంగళూరు కంటోన్మెంట్) ఏప్రిల్ 12 నుంచి 26 వరకు ఆదివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
రైలు నెం: 06207 (బెంగళూరు కంటోన్మెంట్- కలబురగి) ఏప్రిల్ 11 నుంచి 25 వరకు శనివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
రైలు నెం: 06208 (కలబురగి- బెంగళూరు కంటోన్మెంట్) ఏప్రిల్12 నుంచి 26 వరకు ఆదివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
రైలు నెం: 06539 (ఎస్ఎంవీటీ బెంగళూరు-బీదర్) ఏప్రిల్ 10 నుంచి 12 వరకు.. ఏప్రిల్ 17 నుంచి 26 వరకు శుక్ర, ఆదివారాల్లో (6 సర్వీసులు) నడుస్తుంది.
రైలు నెం: 06540 (బీదర్- ఎస్‌ఎంవీటి బెంగళూరు) ఏప్రిల్ 11 నుంచి 13 వరకు.. ఏప్రిల్ 16 నుంచి 27 వరకు శనివారాలు, సోమవారాల్లో (6 సర్వీసులు) నడుస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్: ఎంపీ లక్ష్మణ్
ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
For More TG News And Telugu News