మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 17 , 2026 | 07:02 AM
మహిళలు, చిన్నారుల భద్రతతోపాటు వారికి సురక్షిత వాతావరణం కల్పించడానికి మరింత ప్రాధాన్యం ఇస్తామని మహిళా భద్రతా విభాగం చీఫ్ డాక్టర్ సౌమ్యా మిశ్రా స్పష్టం చేశారు.
మహిళా భద్రతా విభాగం చీఫ్ సౌమ్యా మిశ్రా
మహిళలు, చిన్నారుల భద్రతతోపాటు వారికి సురక్షిత వాతావరణం కల్పించడానికి మరింత ప్రాధాన్యం ఇస్తామని మహిళా భద్రతా విభాగం చీఫ్ డాక్టర్ సౌమ్యా మిశ్రా స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే అమలవుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి.. ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తామన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం చీఫ్‌గా ఉన్న చారుసిన్హా నుంచి ఆమె బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలపై హింసను అరికట్టేందుకు సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం, సమిష్టి బాధ్యత అవసరమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News