Share News

పురుషాహంకారంతోనే సోనియా ఆత్మకథపై బీజేపీ విమర్శలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 06:37 AM

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకంపై బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ అనుబంధ సమూహాల నుంచి వస్తున్న విమర్శల్లో పురుషాహంకారమే కనిపిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ అన్నారు.

పురుషాహంకారంతోనే సోనియా ఆత్మకథపై బీజేపీ విమర్శలు
Kota Neelima

  • మోదీ ఎన్నో సార్లు ఆమెను అవమానించారు: కోట నీలిమ

  • ముగిసిన ఛాయా సాహిత్యోత్సవం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకంపై బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ అనుబంధ సమూహాల నుంచి వస్తున్న విమర్శల్లో పురుషాహంకారమే కనిపిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ అన్నారు. రాజీవ్‌గాంధీని వివాహమాడి ఈ దేశపు కోడలిగా అడుగుపెట్టిన సోనియాను విదేశీయురాలిగా చిత్రీకరించే క్రమంలో వాళ్లు ఇష్టానుసారంగా దుర్భాషలాడారని మండిపడ్డారు. ఛాయా సాహిత్యోత్సవం రెండో రోజు ‘ది పాలిటిక్స్‌ ఆఫ్‌ లవ్‌, ది పవర్‌ ఆఫ్‌ బిలాంగింగ్‌’ అంశంపై కోట నీలిమ మాట్లాడారు.


సోనియా ఆలోచనలను, అభిప్రాయాలను, విభిన్న అంశాలపై ఆమె దృక్పథాలను బయటకు వెల్లడించిన మొట్ట మొదటి పుస్తకం ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ మాత్రమే అని చెప్పారు. మోదీ సహా రాజకీయ ప్రత్యర్థులు ఎన్నోసార్లు సోనియాను ‘బహర్‌ బహర్‌’ అంటూ తీవ్రంగా అవమానించారని.. అయినా సోనియా తన పుస్తకంలో చాలా హుందాగా విమర్శించారే గానీ ద్వేషం, అసహనం ఇసుమంతైనా ప్రదర్శించలేదన్నారు. ప్రఖ్యాత జర్నలిస్టు జోసి జోసెఫ్‌ రాసిన ఆంగ్ల రచనకు ‘మలుపు’ ప్రచురించిన తెలుగు అనువాదం ‘నిశ్శబ్ద కుట్ర- అదృశ్య రాజ్య చరిత్ర’ పుస్తకాన్ని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్య నిజ స్వరూపాన్ని కళ్లకు కట్టే సంఘటనలను రచయిత ప్రతిభావంతంగా ఈ పుస్తకంలో వివరించారన్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 06:37 AM