జెన్‌కోకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:43 AM
తెలంగాణ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి నిర్ణయించింది.
సరఫరా చేయాలని సింగరేణి నిర్ణయం: సింగరేణి
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఒడిసాలోని నైనీ బొగ్గు గని నుంచి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రోజుకు కనీసం 16 వేల టన్నుల బొగ్గు రవాణా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, తెలంగాణ జెన్‌కో సీఎండీ డాక్టర్ హరీశ్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో సమన్వయ సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు.
తెలంగాణ జెన్‌కో థర్మల్ కేంద్రాలకు బొగ్గు రవాణాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాలని సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్ సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లకు సూచించారు. గత మూడు నాలుగేళ్లతో పోల్చితే ఈ ఏడాది తెలంగాణ జెన్‌కోకు ఎక్కువ బొగ్గు సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరిగితే సింగరేణి తన సామర్థ్యం మేరకు మరింత బొగ్గు అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఒడిసాలో స్థానికంగా రవాణా సమస్యల వల్ల బొగ్గు రవాణాలో కొంత జాప్యం జరుగుతోందని, ఈ నెలాఖరు నుంచి 16 వేల టన్నుల బొగ్గును తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జెన్‌కో సీఎండీ డాక్టర్ హరీశ్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News