సింగరేణి అధికారులకు దసరా కానుక
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:37 AM
సింగరేణి అధికారులకు యాజమాన్యం దసరా కానుక ప్రకటించింది. కోలిండియా తరహాలోనే అధికారులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 1-7 వరకు వేతనాల పెంపు
హైదరాబాద్/ఇల్లెందు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): సింగరేణి అధికారులకు యాజమాన్యం దసరా కానుక ప్రకటించింది. కోలిండియా తరహాలోనే అధికారులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎగ్జ్జిక్యూటివ్ క్యాడర్-1 నుంచి ఎగ్జ్జిక్యూటివ్ క్యాడర్-7 వరకు ఉన్న సుమారు 1,800 మంది అధికారులకు ప్రయోజనం చేకూరనుంది. ఆర్థిక ప్రయోజనాలు సెప్టెంబరు 25, 2026 నుంచే వర్తించనున్నాయి.
పెరిగిన వేతనాలను అక్టోబరు నెల జీతాల నుంచి చెల్లించనున్నారు. సవరించిన వేతనాల అమలుకు సంబంధించి సంస్థ డైరెక్టర్(పర్సనల్) గౌతమ్ పోట్రు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సింగరేణి అధికారుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
మద్యం విక్రయాల జోరు.. దసరా నేపథ్యంలో ఫుల్ జోష్
డిజిటల్ వేదికపై తాండూరు కందిపప్పు రైతులు
Read Latest AP News And Telangana News And International