కొండాపూర్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్..!
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:34 PM
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ 'క్వేక్ అరినా పబ్' డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గురువారం రాత్రి పబ్‌లో 64 మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 03: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ 'క్వేక్ అరినా పబ్' డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గురువారం రాత్రి పబ్‌లో 64 మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు. వారిలో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. ఈ రోజు.. శుక్రవారం మరోసారి ఈ ఎనిమిది మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు. వారిలో ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. ఒకరికి.. రిత్విక్‌కు మాత్రం నెగెటివ్ వచ్చింది.
డ్రగ్స్ తీసుకున్న రితీశ్, జ్యోతిరాదిత్య, అభిషేక్ వర్మ, హరిత్ సారంగ, రిషబ్ శ్రీవాస్తవ్, పృథ్వీరాజ్, మోనిశ్ సత్వానీలను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించి ఈగల్ అధికారులు విచారిస్తున్నారు. పబ్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి? వాటిని సరఫరా చేసింది ఎవరు? అనే కోణంలో ఈగల్ అధికారులు విచారణ జరుపుతున్నారు. పబ్ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించిందా? లేదా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రిత్విక్‌కి కల్లు పాజిటివ్‌తోపాటు బెంజోడియాజెపైన్ పాజిటివ్ వచ్చింది. కల్లు తాగడంతోపాటు డిప్రెషన్ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నట్లు రిత్విక్ వెల్లడించారు. అతడి మినహా మిగిలిన వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారికి నోటీసులు ఇచ్చి కాసేపట్లో పంపనున్నారు. ఏడుగురిలో ఎవరికీ.. గతంలో డ్రగ్స్ తీసుకున్న చరిత్ర లేదని పోలీసులు వెల్లడించారు. గురువారం డ్రై డే కావడంతో.. పబ్‌లో 10 గంటల తర్వాత లిక్కర్ సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.
ఈ ఏడుగురిలో ఆరుగురు హైదరాబాద్‌కి చెందిన వాళ్లు కాగా.. ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని తెలిపారు. ఒక్కోక్కరు ఒక్కో ప్రదేశంలో డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు పోలీసులు చెప్పుకోచ్చారు. పబ్‌లో మాత్రం వాళ్లు తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. ఈ డ్రగ్స్ తీసుకున్న ఏడుగురిలో ఒకరు ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి కుమారుడు ఉన్నారని ఈగల్ టీమ్ వెల్లడించింది. గురువారం పబ్‌లో జరిగిన ఈవెంట్‌లో దాదాపు 1500 మంది హాజరైనట్లు ఈగల్ టీమ్ విచారణలో వెల్లడైంది.
ఈ వార్తలు చదవండి..
రాజధాని అమరావతికి.. త్వరలో పిన్‌కోడ్
మీకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదా? వైసీపీ ఎంపీలపై విజయసాయి ఫైర్
For More TG News And Telugu News