మేడారంలో ఘోర ప్రమాదం.. రాతి కట్టడం పడి బాలుడి కాలు తొలగింపు
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:43 PM
ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదం.. ఒక చిన్నారి జీవితంలో చీకటిని నింపింది. వివరాల్లోకి వెళితే..
ములుగు, ఏప్రిల్3: ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదం.. ఒక చిన్నారి జీవితంలో చీకటిని నింపింది. మేడారం పూజారి సిద్ధబోయిన రమేశ్ కుమార్ కొడుకు యువన్‌పై ఒక్కసారిగా రాతి కట్టడం కూలి పడటంతో ఈ దారుణం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. బాలుడు యువన్ ఆడుకుంటున్న సమయంలో సమీపంలోని ఒక రాతి కట్టడం ఒక్కసారిగా అతడిపై పడింది. ఈ ప్రమాదంలో బాలుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే యువన్ తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రంగా ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. తమ కళ్ల ముందు ఆడుకోవాల్సిన బిడ్డ.. ఇలా కాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో వారి ఆవేదన చూసి స్థానికులు సైతం చలించిపోయారు.
ఇవి కూడా చదవండి...
గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ స్పందన
అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ: కవిత
Read Latest Telangana News And Telugu News