యాక్సిస్ బ్యాంకు ఏటీఎం దోపిడీ
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:35 AM
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌లోని హైదరాబాద్ - బెంగుళూర్ జాతీయ రహదారిపై ఉన్న సాతంరాయి యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో అంతరాష్ట్ర ముఠా దోపిడీకి పాల్పడింది.
7.40 లక్షలు దోచుకెళ్లిన ముఠా ..
శంషాబాద్ సాతంరాయిలో ఘటన
శంషాబాద్ రూరల్(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌లోని హైదరాబాద్ - బెంగుళూర్ జాతీయ రహదారిపై ఉన్న సాతంరాయి యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో అంతరాష్ట్ర ముఠా దోపిడీకి పాల్పడింది. ఏటీఎంను ధ్వంసం చేసి రూ.7.40 లక్షలు ఎత్తుకెళ్లింది. సోమవారం బ్యాంకుకు వచ్చిన మేనేజర్ ఏటీఎం ధ్వంసమైనట్లు గుర్తించి శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. నిందితులు ఫుటేజీలు కనిపించకుండా సీసీ కెమెరాలపై స్ర్పే చల్లారు. ఆ తర్వాత ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు.
కొన్ని రోజుల నుంచి రెక్కీ నిర్వహించిన దోపిడీ ముఠా రాత్రి సమయంలో ఈ ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడాన్ని గమనించి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. నలుగురి కంటే ఎక్కువ మంది కలిగిన అంతర్రాష్ట్ర ముఠా ఇందులో పాల్గొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్వ్కాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ పవన్‌కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
సైబర్ నేరగాళ్లు లక్షలు కొట్టేశారు!
రాహుల్‌కు అబద్ధాలు అలవాటే
దొంగ ఓట్లు తొలగిస్తుంటే గగ్గోలు ఎందుకు?
Read Latest AP News And Telugu News