Share News

దొంగ ఓట్లు తొలగిస్తుంటే గగ్గోలు ఎందుకు?

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:31 AM

సర్‌ ప్రక్రియలో భాగంగా దొంగ ఓట్లను తొలగిస్తుంటే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుు ఎన్‌. రాంచందర్‌రావు కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు.

దొంగ ఓట్లు తొలగిస్తుంటే గగ్గోలు ఎందుకు?
Ramchander Rao

  • ఫారం 7 ఇచ్చిన వాళ్లపై కేసులు పెడతారా

  • రాష్ట్రంలో 70 లక్షల దొంగ ఓట్లున్నాయన్న సింఘ్వీ మాటేంటి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపాటు

  • పాతబస్తీలో ఎంఐఎం గెలుపు దొంగ ఓట్ల వల్లేనని వ్యాఖ్య

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియలో భాగంగా దొంగ ఓట్లను తొలగిస్తుంటే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుు ఎన్‌. రాంచందర్‌రావు కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు. తెలంగాణలో 70లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ 2018లో చేసిన ప్రకటన సంగతేంటని ప్రశ్నించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా దొంగ ఓట్లను తొలగించాలా? వద్దా? కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలక్టోరల్‌ రిట్నరింగ్‌ అధికారి(ఈఆర్‌ఓ)కి ఫారం 7 ఇచ్చిన వారిపై కేసులు పెట్టడం ఏంటని ? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈఆర్‌ఓకి ఫారం 7ని ఎవరైనా ఇవ్వొచ్చని, ఆ ఫారం ఇవ్వగానే ఓట్లు తొలగించరని, ఈఆర్‌ఓ ఇరు పార్టీలకు నోటీసులిచ్చి విచారణ చేపట్టి వివరాలను అన్ని పార్టీల బీఎల్‌ఏలకు అందిస్తారని తెలిపారు.


ఈ ప్రక్రియంతా పాదర్శకంగా జరుగుతుందని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీ ఇన్నాళ్లూ దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిందని ఆరోపించారు. ఆ పార్టీ నేత ఒవైసీ ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతోందని ఆరోపించారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ఆరాటంతో కాంగ్రెస్‌, ఇండీ కూటమి పార్టీలు రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతపై ప్రజల్లో విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. ఫారం7ను భూతంలా చూపిస్తూ ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 2.8 కోట్ల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్‌ పార్టీ .. చనిపోయిన వారి పేర్లను జాబితాలో ఉంచాలా? తొలగించాలా? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫారమ్‌-6 మార్పులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్‌ వక్రీకరిస్తోందని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి...
సైబర్‌ నేరగాళ్లు లక్షలు కొట్టేశారు!

రాహుల్‌కు అబద్ధాలు అలవాటే
లైపోప్రొటీన్‌(ఎ).. సైలెంట్‌ కిల్లర్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 04:31 AM