Share News

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి మ్యాట్రిమోనీ సంస్థ 2 లక్షలకు టోకరా

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:17 AM

కుమారుడికి తగిన సంబంధం చూస్తామంటూ ఢిల్లీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ఓ మ్యాట్రిమోనీ సంస్ధ డబ్బు తీసుకొసి మోసం చేసింది.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి మ్యాట్రిమోనీ సంస్థ 2 లక్షలకు టోకరా
Hyderabad Matrimony Fraud

  • కుమారుడికి సంబంధం చూస్తామని మోసం

  • పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు

బంజారాహిల్స్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కుమారుడికి తగిన సంబంధం చూస్తామంటూ ఢిల్లీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ఓ మ్యాట్రిమోనీ సంస్ధ డబ్బు తీసుకొసి మోసం చేసింది. ఢిల్లీ లజ్‌పత్‌ నగర్‌ నివాసి పునీత్‌కుమార్‌ గోయల్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లోని హైలైన్‌ కాంప్లెక్స్‌ ఉన్న 7-వావ్స్‌ మ్యాట్రిమోనీ సంస్థను ఆశ్రయించారు. 2024 జూలైలో సదరు సంస్థకు లక్ష రూపాయలు చెల్లించారు.


కొద్దిరోజులు పాటు ప్రొఫైళ్లు చూపించిన సంస్థ నిర్వాహకులు, ఆ తర్వాత స్పందించడం మానేసి ఒప్పందం రెన్యూవల్‌ చేసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. దాంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో లక్ష చెల్లించారు. ఆ తర్వాత కూడా నిర్వాహకులు సుమన్‌ అగర్వాల్‌, నైనా ఎలాంటి స్పందన లేకుండా ముఖం చాటేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఐఏఎస్‌ అధికారి కుమార్‌ గోయల్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నెట్‌ జీరో క్యాంప్‌సగాఎన్‌ఐయూఎం ప్రాంగణం

‘ఎల్‌నినో’పై మంత్రివర్గ ఉపసంఘం

దీపావళికి నామినేటెడ్‌ ధమాకా!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 05:17 AM