Share News

బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి సీతక్క కౌంటర్

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:24 PM

గత పదేళ్లుగా వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచలేదు కానీ.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ శాసన సభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డికి సీతక్క కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి సీతక్క కౌంటర్
TG Minister Seethakka

హైదరాబాద్, మార్చి 24: గత పదేళ్లుగా వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచలేదు కానీ.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ శాసన సభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డికి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కేంద్రం ఏ రకంగా మద్దతు ఇవ్వకున్నా ప్రజాసంక్షేమం కోసం తమ ప్రభుత్వం అధికంగా నిధులు వెచ్చిస్తుందన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా.. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత మీకు లేదా? అంటూ వారిని సూటిగా ప్రశ్నించారు.


వ్యవసాయంపై కేంద్రం నల్ల చట్టాలు తీసుకు వస్తే.. దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటం చేశారన్నారు. దాంతో కేంద్రం వెనక్కి తగ్గిందని సీతక్క గుర్తు చేశారు. దేశంలో బడా పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.16 లక్షల కోట్లను రుణమాఫీ చేశారు కానీ రైతు రుణమాఫీ మాత్రం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. వడ్డీ లేని రుణాల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ నేతల వైఖరిని ఈ సందర్భంగా ఎండగట్టారు.


బ్యాంకింగ్ రుణాల కింద రూ.58 వేల కోట్ల మంజూరు చేశామని సీతక్క గుర్తు చేశారు. అలాగే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్, సన్న వడ్లతోపాటు రూ. నాలుగున్నర లక్షల కోట్లతో ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నామని తెలిపారు. మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలకు పని లేదన్నారు. రైతులకు ప్రతి నెల పెన్షన్స్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. అదే విధంగా విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని ప్రకటించారని చెప్పారు.


రూ. 50కే లీటర్ పెట్రోల్ ఇస్తామన్నారని సీతక్క గుర్తు చేశారు. కానీ పెట్రోల్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచారంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. విభజన హామీలు నెరవేర్చకుండా వట్టిగా ప్రసంగిస్తే ఏం ఉపయోగం అంటూ బీజేపీ నేతలకు ఈ సందర్భంగా సీతక్క చురకలంటించారు. తెలంగాణ ప్రజలు చెల్లించే పన్నులు కావాలి కానీ.. ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాత్రం పట్టవా అంటూ బీజేపీ నేతలను ఈ సందర్భంగా నిలదీశారు.


గత ప్రభుత్వ తీరు వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని సీతక్క స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆర్థిక చేయూతతో నాలుగు లక్షల 70 వేల మంది మహిళలు వ్యాపారాలు చేసుకుంటున్నారని వివరించారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేస్తామని సంకల్పంతో తాము పని చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎగతాళి చేయడం మీకే చెల్లిందంటూ బీజేపీ శాసన సభ పక్ష నేత మహేశ్వరరెడ్డి తీరును ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఎండగట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈవీ వాహనాలపై 20 శాతం డిస్కౌంట్: మంత్రి పొన్నం

వెళ్తున్నానని తెలిసి.. అలా వచ్చి వెళ్లారు: జీవన్ రెడ్డి

For More TG News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 02:39 PM