Share News

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న సీతక్క

ABN , Publish Date - Oct 18 , 2026 | 02:48 PM

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం సమీపంలో అమరజ్యోతి ప్రాంగణం వద్ద బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 18: నగరంలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో అమరజ్యోతి ప్రాంగణం వద్ద బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆమె ఆధ్వర్యంలో ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పూలను అందంగా పేర్చి.. బతుకమ్మను సిద్ధం చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ పండుగను వారంతా సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.


దీంతో అమరజ్యోతి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బతుకమ్మ వేడుకలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చారు.


తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. ప్రకృతిని ఆరాధిస్తూ, వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలు సమూహాలుగా ఏర్పడి పాటలు పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. మహిళల మధ్య ఐక్యత, ఆత్మీయతను పెంపొందించడంలోనూ ఈ పండుగ కీలక పాత్ర పోషిస్తుంది.


ఈ వార్తలూ చదవండి

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్

విజయనగరంలో ఎవరికి వారే!

For More AP News And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 03:20 PM