Share News

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్

ABN , Publish Date - Oct 18 , 2026 | 02:09 PM

కూటమి అభ్యర్థిగా విజయవాడ మేయర్ స్థానానికి జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు.

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్
Vangaveeti Radha Krishna

విజయవాడ, అక్టోబర్ 18: కూటమి అభ్యర్థిగా విజయవాడ మేయర్ స్థానానికి జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. తన కార్యాలయం నుంచి కూటమి నేతలు, కార్యకర్తలతో ఆర్వో కార్యాలయానికి వెళ్లి.. నామినేషన్ పత్రాలు సమర్పించారు.


అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నటుడు చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. ‘పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ మాధవ్.. వీరందరి ఆమెదంతో నన్ను విజయవాడ నగరంలో మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. రాజకీయ రాజధాని విజయవాడ మేయర్ అభ్యర్థిగా నన్ను ఖరారు చేయడం సంతోషంగా ఉంది. ముగ్గురు శాసనసభ్యుల సహకారంతో మన నగరానికి మంచి పేరు తీసుకొస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం సహకారంతో విజయవాడను ఇంకా అభివృద్ధి చేస్తామని వంగవీటి రాధాకృష్ణ చెప్పారు.


ఈ వార్తలూ చదవండి

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులు.. పుంగనూరుకు రావొద్దని ఆదేశం

విజయనగరంలో ఎవరికి వారే!

Updated Date - Oct 18 , 2026 | 02:13 PM