ఎస్సీబీలో అవినీతి ఆరోపణలు.. మూడేళ్ల భవన నిర్మాణ అనుమతులపై సీబీఐ ఆరా
ABN , Publish Date - Nov 23 , 2026 | 10:26 AM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అవినీతిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. గత మూడేళ్లుగా బోర్డు జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులపై సీబీఐ ఆరా తీస్తోంది.
హైదరాబాద్, నవంబరు 23: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అవినీతిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. గత మూడేళ్లుగా బోర్డు జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులపై సీబీఐ ఆరా తీస్తోంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అవినీతిపై ఫిర్యాదుల నేపథ్యంలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు.. బిల్డర్లతో చేతులు కలిపి అక్రమ నిర్మాణాలకు సహకరించారని సీబీఐకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని సీబీఐ వారం రోజులుగా విచారణ కొనసాగిస్తోంది. గత మూడేళ్లుగా బోర్డు జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులపై ఆరా తీస్తోంది.
కాగా.. 2011లోనూ కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంపై సీబీఐ విచారణ చేసింది. అప్పట్లో 8 మంది ఇంజినీరింగ్ అధికారులపై అభియోగాలు నమోదు కాగా.. ప్రస్తుతం అందులో ఆరుగురు రిటైర్ అయినట్లు, మరో ఇద్దరు ఉన్నతస్థాయి హోదాలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల క్రితం విచారణ చేసిన కేసులో ఇప్పటికీ చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలూ చదవండి
పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!