Share News

Sankranti Rush: సంక్రాంతి శోభ.. రద్దీగా మారిన రహదారులు..

ABN , Publish Date - Jan 09 , 2026 | 09:05 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు, ఆఫీసులకు వీకెండ్ కావడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నగర వాసులు పోటెత్తారు.

Sankranti Rush: సంక్రాంతి శోభ.. రద్దీగా మారిన రహదారులు..
Sankranti Festival Rush

హైదరాబాద్: సంక్రాంతి పండుగ(Sankranti Festival) సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు (Sankranti Rush) కిక్కిరిపోతున్నాయి. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు, ఆఫీసులకు వీకెండ్ కావడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నగర వాసులు పోటెత్తారు. పట్టణాల నుంచి సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కళకళలాడుతున్నాయి. మరోవైపు సొంత వాహనాల్లోనూ ప్రజలు స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలమయంగా(Sankranti Travel Traffic) మారిపోయాయి.


ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ పల్లెలు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లే వారితో రోడ్లన్నీ నిండిపోయాయి. హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారి అయితే మరింత రద్దీగా మారింది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల బారులు తీరాయి. దీంతో స్వగ్రామాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యగా మారిపోయింది. రద్దీ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు చేయాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth: వివాదాలు వద్దు.. పరస్పర సహకారం అవసరం: సీఎం రేవంత్

Hyderabad CP: సైబర్ బాధితులకు అండగా పోలీసులు: సీపీ సజ్జనార్

Updated Date - Jan 09 , 2026 | 09:07 PM