Share News

AP TET-2025: ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Jan 09 , 2026 | 07:56 PM

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలను శుక్రవారం నాడు మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. తన ఎక్స్ ఖాతా వేదికగా ఈ ఫలితాలను వెల్లడించారు.

AP TET-2025: ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
AP TET 2025 Results

అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP TET-2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్‌ను ఈ రోజు(శుక్రవారం) సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా టెట్ ఫలితాలను వెల్లడించారు. అభ్యర్థులు తమ మార్క్స్‌మెమో, ఫలితాలను www.tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని మంత్రి లోకేశ్ తెలిపారు. గతేడాది డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు జరిగిన టెట్ పరీక్షలకు మెుత్తం 2,48,427మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 47.82 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.


ఎలా చూడాలి.?

tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్ చేయండి. వెబ్‌సైట్ హోంపేజీలో కనిపించే రిజల్ట్స్ లింక్‌ను క్లిక్ చేసి క్యాండిడెట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయాలి. వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీ స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఎప్పుడైనా చూసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. అభ్యర్థుల సౌకర్యార్థం 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫలితాలు చూసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు ఇబ్బంది కలగకూడదనే రాజీనామా: జంగా

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..

Updated Date - Jan 09 , 2026 | 08:34 PM