Share News

Maoists: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:15 PM

కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మావోయిస్టులకు మరో షాక్ తగిలింది.

Maoists: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..

రాయ్‌పూర్, జనవరి 09: ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులు ఎదుట 63మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 18 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ కడ్తీ.. తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు మావోయిస్టులు అప్పగించారు. ఈ రోజు లొంగిపోయిన మొత్తం మావోయిస్టులపై రూ.కోటి రివార్డు ఉందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లోన్ వర్రాటు (ఇంటికి తిరిగి రండి) ప్రచారంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.


2026, మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను శాశ్వతంగా నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటించింది. అందుకోసం ఆపరేషన్ కగార్‌ను అమలు చేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో వారి ప్రభావం కొంత మేర ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల ఎరివేతకు నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దాంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుని.. వందలాది మంది మావోయిస్టులు మరణించారు.


అలాగే వేలాది మంది మావోయిస్టులు ఇప్పటికే ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం గతంలో ప్రకటించిన రివార్డులను అందజేస్తోంది. అదీకాక.. మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగం కావాలంటూ ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం చేపట్టిన కూంబింగ్‌లో పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌ కాగా.. కీలక నేతలు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. మరోవైపు భారీగా వారిని పోలీసులు, భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ సభ్యత్వానికి జంగా రాజీనామా.. ఆమోదించాలంటూ సీఎంకు లేఖ

జగన్ శైలి పైన మృదుత్వం.. లోన కర్కశత్వం: మంత్రి ఆనం

For More National News And Telugu News

Updated Date - Jan 09 , 2026 | 04:36 PM