Share News

కౌగించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఫారిన్‌ పాలసీ కాదు: సల్మాన్‌ ఖుర్షీద్‌

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:26 AM

మోదీ ప్రభుత్వానికి సరైన విదేశాంగ విధానమంటూ ఏమీ లేదని విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ విమర్శించారు.

కౌగించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఫారిన్‌ పాలసీ కాదు: సల్మాన్‌ ఖుర్షీద్‌
Salman Khurshid

మోదీ ప్రభుత్వానికి సరైన విదేశాంగ విధానమంటూ ఏమీ లేదని విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ విమర్శించారు. తాత్కాలిక నిర్ణయాలతో ముందుకు సాగుతోందని, ఇది దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ప్రతినిధులను కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ఫారిన్‌ పాలసీ కాబోదన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వానికి స్థిరమైన విదేశాంగ విధాన చట్రం కనిపించడం లేదు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఆలోచనతో వ్యవహరించడం లేదు. విదేశాంగ విధానంలో కొనసాగింపు, వ్యూహాత్మక దూరదృష్టి, స్పష్టత ఎంతో అవసరం.


దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాల ఆధారంగా కాకుండా, పరస్పర ప్రయోజనాలు, తాత్కాలిక లావాదేవీల ప్రాతిపదికన అమెరికా, ఇరాన్‌, రష్యా, చైనాలతో కేంద్రం వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. రష్యాతో భారత్‌కు సంప్రదాయబద్ధంగా ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులకు లోనైనట్లు కనిపించింది’’ అని వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 05:26 AM