బియ్యం అక్రమ నిల్వలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:13 AM
బియ్యం అక్రమంగా నిల్వ చేసి.. కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలకు దిగారు.
18 మంది వ్యాపారులపై కేసులు
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): బియ్యం అక్రమంగా నిల్వ చేసి.. కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలకు దిగారు. పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్(ఈటీఎఫ్), తూనికలు, కొలతల శాఖ అధికారుల బృందాలు.. అక్టోబరు 29 నుంచి 31 తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రిటైల్, హోల్‌సేల్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 11 ఎఫ్‌ఆర్‌లు నమోదు చేసి... 18 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోల లేబుల్స్ వేసి తూకంలో మోసం చేస్తున్నట్లు తనిఖీల్లో వెలుగు చూసింది.
అంతేకాదు, అసలు ధర కంటే ఎక్కువ రేట్లతో ఉన్న స్టిక్కర్లను అతికించి బియ్యం అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ట్రేడ్, జీఎస్టీ, లేబర్, ఎఫ్‌ఎస్ఎస్ఏఐ లైసెన్సులు లేకుండానే చాలా మంది బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలను మోసం చేస్తున్న అక్రమార్కులపై సరూర్‌నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం, భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) కింద 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News