ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 13 , 2026 | 07:10 PM
రాష్ట్రంలోని ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగి.. ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13: రాష్ట్రంలోని ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగి.. ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు చెప్పారు. వాడవాడలా గణేష్ మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. గణేష్ నవరాత్రుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా నగర పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వినాయక మండపాలకు ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ
కోకాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థి స్పాట్ డెడ్
For More TG News And Telugu News