కేసీఆర్ ఐరన్ లెగ్
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:24 AM
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకొంటున్న పార్టీ అధినేత (కేసీఆర్) రాజకీయంగా ఐరన్ లెగ్‌గా మారారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు.
థర్డ్ ఫ్రంట్ అంటూ ఆయన కలిసినవారంతా ఓడిపోయారు
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగడతాం
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్
హైదరాబాద్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకొంటున్న పార్టీ అధినేత (కేసీఆర్) రాజకీయంగా ఐరన్ లెగ్‌గా మారారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ దేశమంతా తిరిగి ఎవరినైతే కలిశారో వారంతా ఓడిపోయారన్నారు. బెంగాల్‌లో మమతాబెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఏపీలో జగన్ మోహన్‌రెడ్డి, చివరకు తెలంగాణలో కేసీఆర్ కూడా ప్రజల చేతిలో ఔటయ్యారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రె్‌సకు తిరుగులేని ప్రత్యామ్నాయం బీజేపీయేనని, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, తప్పిదాలు, దుర్మార్గపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు. ఒక వైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ సమస్యలను వదిలేసి సగం కాలం అమెరికా, యూర్‌పలలో గడుపుతుంటే, మరో వైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ పర్యటనలకే పరిమితం అయ్యారని విమర్శించారు.
బీజేపీయే ప్రత్యామ్నాయం: రాంచందర్‌రావు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను వీడి యువత తమ పార్టీలో చేరుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. పాతబస్తీ నుంచి గురువారం పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటాలి
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News