Share News

రాహుల్‌ అరెస్టు ప్రజాస్వామ్యానికి మచ్చ

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:47 AM

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని రెండోసారి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ అన్నారు.

రాహుల్‌ అరెస్టు ప్రజాస్వామ్యానికి మచ్చ
Mahesh Kumar Goud

  • టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని రెండోసారి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ అన్నారు. దీన్ని టీపీసీసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమన్నారు. రాహుల్‌, ప్రియాంకలను రాజకీయంగా ఎదుర్కొనలేక.. మోదీ ప్రభుత్వం అరెస్టుల మార్గాన్ని ఎంచుకుందన్నారు. ఇండియా కూటమి నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.


ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలను అణచివేసేందుకు అరెస్టులను ఆయుధంగా ఉపయోగించడం పిరికితనానికి నిదర్శనమన్నారు. ఇండియా కూటమి నాయకులు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని విమర్శించారు. దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారని, మోదీ ప్రభుత్వానికి రాజకీయంగా రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రోత్సహించడమే మా ప్రభుత్వ లక్ష్యం: పెమ్మసాని

ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: మంత్రి నాదెండ్ల మనోహర్

పంట నష్టాల అంచనాలు తక్షణమే పూర్తి చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 06:47 AM