మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా విధించాలి
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:24 AM
మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా విధించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
జాతీయ కులగణనలో ఓబీసీ కాలం పెట్టాలి: ఆర్. కృష్ణయ్య
బర్కత్‌పుర, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా విధించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రం జనవరిలో చేపట్టనున్న జాతీయ కులగణనలో ఓబీసీ కాలం పెట్టాలని.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అల్లం యాదయ్య అధ్యక్షతన బీసీ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఉద్యోగ రంగాల్లో బీసీలపై విధించిన క్రీమిలేయర్‌ను రద్దు చేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 27 నుంచి 56 శాతానికి పెంచాలని కోరారు. అల్లం యాదయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 30వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని, మిగిలిన లక్షా 70వేల కొలువులనుు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్