పీఆర్‌టీయూ అధ్యక్ష కార్యదర్శులుగా మధుసూదన్ రెడ్డి, కట్టా శేఖర్
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:36 AM
ప్రోగ్రెసివ్ రికగ్నైజ్జ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నికలు నారాయణగూడలోని సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగాయి.
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రోగ్రెసివ్ రికగ్నైజ్జ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నికలు నారాయణగూడలోని సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఎమ్మె ల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా బి.మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కట్టా శేఖర్‌లను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సుంకరి బిక్షం గౌడ్ పదవీ విరమణ చేయడంతో అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన మధుసూదన్ రెడ్డిని అధ్యక్షుడిగా, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కట్టా శేఖర్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News