కేటీఆర్.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా..?
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:07 AM
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శిస్తున్న కేటీఆర్.. అదే ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలిలో బీఆర్‌ఎస్ బందీ కావద్దు: పొన్నం
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శిస్తున్న కేటీఆర్.. అదే ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ మద్దతు తమకు అవసరం లేదని చెబుతున్నా.. కేటీఆర్ ఎందుకు ఉరికి ఉరికి కేంద్రానికి ఊడిగం చేస్తున్నారన్నారు.
కేసుల భయంతోనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా? అంటూ ఓ ప్రకటనలో నిలదీశారు. తెలంగాణకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెరుగుతుందనే సాకుతో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం సరైంది కాదన్నారు. బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలిలో బీఆర్‌ఎస్ బందీ కావద్దని, ఆ పార్టీ రాజకీయంగా బీజేపీతో కలిసే ప్రయాణం చేస్తే చివరకు తన ఉనికినే కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా తెలంగాణ ప్రయోజనాలే అందరికీ ప్రథమ ప్రాధాన్యత కావాలని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్