యూట్యూబర్ అన్వేష్‌పై లుక్‌అవుట్ నోటీసులు
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:55 PM
నా అన్వేషణ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవలే అన్వేష్ అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 25: ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)కు మరో బిగ్‌షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్ అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అతడు తనకు ఇంకా రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని వీడియో విడుదల చేశారు. అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ వీడియోను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు... అన్వేష్‌కు సంబంధించిన మరో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో పాటు యూట్యూబ్ ఛానళ్లను మూసివేయాలని సంబంధిత సంస్థలకు లేఖలు రాయనున్నారు. ఇప్పటికే హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు: మంత్రి లోకేశ్
సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Read Latest Telangana News And Telugu News