Share News

లొంగిపో గణపతి.. సోదరుడి విజ్ఞప్తి

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:31 PM

దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని తన కనుసన్నల్లో నడిపి.. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

లొంగిపో గణపతి.. సోదరుడి విజ్ఞప్తి
Maoist Ganapathi

జగిత్యాల, ఫిబ్రవరి 25: దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని తన కనుసన్నల్లో నడిపి.. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. బుధవారం గణపతి సోదరుడు రాంచంద్రరావు జగిత్యాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. మిగిలిన జీవితం తమతో గడపాలని గణపతికి సోదరుడు రాంచంద్రారావు విజ్ఞప్తి చేశారు. గణపతి కోసం ఊరు, కుటుంబం అంతా ఎదురు చూస్తోందన్నారు. తన సోదరుడు గణపతికి ఎటువంటి హాని తలపెట్టవద్దని ఈ సందర్భంగా పోలీసులను కోరారు.


తన సోదరుడు గణపతి నేపాల్‌లో ఉన్నారని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తల్లో చూశానని ఈ సందర్బంగా రాంచంద్రరావు పేర్కొన్నారు. పుట్టిన గడ్డ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడాలంటూ గణపతికి మీడియా ద్వారా సోదరుడు సూచించారు. 43 ఏళ్ల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. మావోయిస్టులంతా లొంగిపోయారని.. నువ్వు కూడా లొంగిపోవాలంటూ సోదరుడుకి రాంచంద్రారావు హితవు పలికారు.


మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తదితరులు లొంగిపోయారు. అదే సమయంలో మావోయిస్ట్ అగ్రనేత గణపతి నేపాల్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన వృద్ధాప్య సమస్యలతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సదరు వార్తా కథనాల్లో వెల్లడైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

భూములిచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎలా?: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ead Latest TG News and National News

Updated Date - Feb 25 , 2026 | 03:02 PM