బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:31 PM
బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. సహచర విద్యార్థినులంతా క్లాసులకు వెళ్లిన సమయంలో హాస్టల్‌లోని ఒక రూమ్‌లో ఒంటరిగా ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 25: బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. సహచర విద్యార్థినులంతా క్లాసులకు వెళ్లిన సమయంలో హాస్టల్‌లోని ఒక రూమ్‌లో ఒంటరిగా ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సహచర విద్యార్థినులు చూసి.. కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వసంత ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థిని మృతిపై ఆమె తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. మృతురాలు.. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుందని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా వసంత స్నేహితులను ప్రశ్నించారు. ఈ రోజు ఉదయం నుంచి ఆమె బాగానే ఉందని చెప్పారు. ఈ రోజు క్లాస్‌కు తాను రాలేనని.. ఒంట్లో కొంత నలతగా ఉందని తమతో చెప్పిందన్నారు. దీంతో తామంతా క్లాస్‌కు వెళ్లామని పోలీసులతో సహచర విద్యార్థినులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
భూములిచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎలా?: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Read Latest TG News and National News