సీఎం రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:58 PM
అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యులు శంతను నారాయణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ సమావేశమయ్యారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 25: అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యులు శంతను నారాయణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్లోబల్ ట్రెండ్స్.. అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి సీఎంతో శంతన్ నారాయణ్ చర్చించారు. అలాగే గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీ స్కిల్లింగ్‌కు సంబంధించిన అంశాలపై వీరిరువురు చర్చించారు.
తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలని, అందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్‌తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని ఈ సందర్భంగా శంతను నారాయణ్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భూములిచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎలా?: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Read Latest TG News and National News