కోమలి సూసైడ్ నోట్.. పోలీసుల అదుపులో ప్రియుడు
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:01 PM
సోషల్ మీడియాలో తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యూట్యూబర్ కోమలి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌లోని మణికొండ చిత్రపురి కాలనీలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానం సంపాదించుకున్న యువ యూట్యూబర్ కోమలి(21) ఆత్మహత్యకు పాల్పడింది. మణికొండలోని చిత్రపురి కాలనీలో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆమె ప్రియుడు అఖిల్ రెడ్డితో విభేదాలు రావడంతో ఏడాది క్రితం ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో భాగంగా.. కోమలి ప్రియుడు అఖిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్యకు ముందు కోమలి.. ఓ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ లెటర్‌లో ‘నేను జీవితంలో ముందుకు సాగడానికి భయపడుతున్నా.. అతను నా వాడు కాదనీ తెలుసు. అతను నాతో ఉండటానికి కూడా ప్రయత్నించడం లేదు. కానీ నా హృదయం అతని కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.. ఇంకా ఆశిస్తూనే ఉంది. ఏదో ఒకరోజు అతను నన్నే ఎంచుకుంటాడని నా మనసు చెబుతోంది. అందుకే ముందుకు సాగడం అసాధ్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే నేను చివరికి వెనక్కి తిరిగి నడిచివెళ్లిన క్షణంలో.. అతను తిరిగొచ్చి నన్ను వెతికితే...’ అని రాసుకొచ్చింది. కోమలి సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తోంది.
ఇవి కూడా చదవండి...
రాజమహేంద్రవరం ఘటన.. పాల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు
క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News