Share News

గోల్కొండ జోన్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్

ABN , Publish Date - Apr 11 , 2026 | 09:41 AM

హైదరాబాద్‌లోని గోల్కొండ జోన్ పరిధిలో పోలీసులు భారీ స్థాయిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మంగళహాట్ ప్రాంతంలోని పలు బస్తీల్లో ఉదయం నుంచే సుమారు 200 మంది పోలీసులతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

గోల్కొండ జోన్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
Hyderabad Police Cordon Search

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో గోల్కొండ జోన్ పరిధిలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు బస్తీల్లో ఈ తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల నుంచే సుమారు 200 మంది పోలీసులతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది.


డ్రగ్స్, గంజాయి నిర్మూలన లక్ష్యంగా ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా మంగళహాట్ ప్రాంతంలోని అప్పర్ దులుపేట్, టక్కర్ వాడి, లాల్ భవన్, జింగుర్ బస్తి తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 10 డొమెస్టిక్ సిలిండర్లు, 7 కమర్షియల్ సిలిండర్లు, 79 చిన్న సిలిండర్లు పట్టుబడ్డాయి. అదేవిధంగా బెల్ట్ షాపుల నుంచి 41 లీటర్ల బీర్, 8 లీటర్ల విస్కీని స్వాధీనం చేసుకున్నారు.


అదనంగా, 3 ఆటోల్లో తరలిస్తున్న 15 చిన్న సిలిండర్లను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని, నెంబర్ ప్లేట్లు లేని 28 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. ఈ కార్డెన్ సెర్చ్ ద్వారా అక్రమ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యమని పోలీసులు తెలిపారు. ఇటువంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.


Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - Apr 11 , 2026 | 09:50 AM