Share News

పీఎం సూర్యఘర్‌ కింద 40 వేల ఇళ్లకు రూఫ్‌టాప్‌ సోలార్‌కు అనుమతి

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:51 AM

పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన పథకం కింద రాష్ట్రంలో 40,349 ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టా్‌పకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) సమ్మతి తెలిపింది.

పీఎం సూర్యఘర్‌ కింద 40 వేల ఇళ్లకు రూఫ్‌టాప్‌ సోలార్‌కు అనుమతి
Rooftop Solar

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన పథకం కింద రాష్ట్రంలో 40,349 ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టా్‌పకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) సమ్మతి తెలిపింది. దీనికి రూ.525 కోట్ల వ్యయం కానుండగా అందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.242 కోట్లను భరించనుంది. మిగిలిన రూ.283 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. అయితే ఈ నిర్ణయం వల్ల గృహజ్యోతి సబ్సిడీ నుంచి ప్రభుత్వానికి ఉపశమనం లభించనుందని, 11 ఏళ్లకాలంలో ఈ నిధులన్నీ వెనక్కి రానున్నాయని గుర్తు చేసింది.


ఈ రూఫ్‌టాప్‌ ప్లాంట్లతో ఏకంగా రూ.444 కోట్లు మిగలనున్నాయని తెలిపింది. ఐదేళ్ల కాలానికి ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ ఎం) యూనిట్లు పెట్టే సంస్థలదేనని గుర్తు చేసింది. ఐదేళ్ల తర్వాత ఈ సోలార్‌ ప్లాంట్ల నిర్వహణ వినియోగదారులే చూసుకోవాలని లిఖితపూర్వకంగా తెలియజేయాలని తెలంగాణ రెడ్‌కోను ఈఆర్‌సీ ఆదేశించింది. ఈ మేరకు ఈఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌, సభ్యులు కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!

అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 06:51 AM