Share News

నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో.. ఎంపీ లక్ష్మణ్‌ పాత్రకు మోదీ ప్రశంసలు

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:47 AM

మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్రం చేపట్టిన ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ ప్రశంసించారు.

నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో.. ఎంపీ లక్ష్మణ్‌ పాత్రకు మోదీ ప్రశంసలు

  • హైదరాబాద్‌లో సైకిల్‌ ర్యాలీ నిర్వహణపై అభినందన

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్రం చేపట్టిన ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు హైదరాబాద్‌లో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీ ద్వారా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన చేసిన కృషిని అభినందించారు.


ఈ మేరకు ఆదివారం ప్రధాని మోదీ.. లక్ష్మణ్‌ను ‘ఎక్స్‌’ ద్వారా ప్రశంసించారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచి, ఆరోగ్యకరమైన జీవన విధానాల వైపు ప్రోత్సహించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్

Updated Date - Nov 30 , 2026 | 04:48 AM