Share News

జనసేన పార్టీ తెలంగాణ కార్యాలయం ప్రారంభించనున్న పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jun 18 , 2026 | 08:42 PM

హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు మల్కం చెరువు సమీపంలోని పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.

జనసేన పార్టీ తెలంగాణ కార్యాలయం ప్రారంభించనున్న పవన్ కల్యాణ్

హైదరాబాద్, జూన్ 18: నగరంలో జనసేన తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు మల్కం చెరువు సమీపంలోని పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ నూతన కార్యాలయంతో తెలంగాణలో పార్టీ విస్తరణకు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే రాష్ట్రంలోని జనసైనికులు, వీరమహిళలు, నాయకులకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.


పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి భారీగా జనసైనికులు తరలి వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన కార్యకలాపాలకు ఈ నూతన కార్యాలయం కేంద్రంగా మారనుందనే ప్రచారం సాగుతోంది. ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు తర్వాత.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, చేరికలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

మైనార్టీ సంక్షేమానికి భారీ కేటాయింపులు: డిప్యూటీ సీఎం మల్లు

ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 08:48 PM