Share News

ఉస్మానియాలో నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల టూల్‌డౌన్‌

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:27 AM

పాత పెన్షన్‌ విధానాన్ని(ఓపీఎస్‌) పునరద్ధరించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, టైమ్‌ స్కేల్‌ ఉద్యోగులకు రావాల్సిన 60 శాతం బకాయిలను తక్షణమే చెల్లించాలని..

ఉస్మానియాలో నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల టూల్‌డౌన్‌
Non Teaching Staff Protest

ఉస్మానియా యూనివర్సిటీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పాత పెన్షన్‌ విధానాన్ని(ఓపీఎస్‌) పునరద్ధరించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, టైమ్‌ స్కేల్‌ ఉద్యోగులకు రావాల్సిన 60 శాతం బకాయిలను తక్షణమే చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. నాన్‌ టీచింగ్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారం పెన్‌ డౌన్‌-టూల్‌ డౌన్‌ నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. తమ పోరాటంలో భాగంగా 4న మహార్యాలీ, 10 ధర్నా నిర్వహించనున్నట్లు ఉస్మానియా నాన్‌ టీచింగ్‌ జేఏసీ ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 06:27 AM