Share News

ఆపరేషన్ ముస్కాన్ -XII విజయవంతం.. 664 మంది చిన్నారుల సేఫ్

ABN , Publish Date - Aug 01 , 2026 | 04:45 PM

సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతంగా ముగిసింది. జులై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు.. మొత్తం 664 మంది చిన్నారులను రక్షించారు.

ఆపరేషన్ ముస్కాన్ -XII విజయవంతం.. 664 మంది చిన్నారుల సేఫ్
Operation Muskaan XII

హైదరాబాద్, ఆగస్టు 1: సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ విజయవంతంగా ముగిసింది. జులై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు.. మొత్తం 664 మంది చిన్నారులను రక్షించారు. వీరిలో 644 మంది బాలురు, 20 మంది బాలికలు ఉన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా తెలంగాణకు చెందిన 162 మంది చిన్నారులను రెస్క్యూ చేయగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన 502 మంది చిన్నారులను గుర్తించారు.


ఆపరేషన్‌లో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలు, కంపెనీలు, దుకాణాలు, హోటళ్లు, నిర్మాణ ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న పిల్లలను, ర్యాగ్ పికింగ్‌తో, ఇతర ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించారు. రక్షించిన చిన్నారుల వివరాలను దర్పణ్ యాప్‌లో పోలీసులు నమోదు చేశారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చే లక్ష్యంతో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చిన్నారుల భద్రతే లక్ష్యంగా నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

55.90 అడుగులకు గోదావరి నీటిమట్టం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

మూడు రోజులైనా దొరకని వృద్ధుడి డెడ్‌బాడీ.. కొనసాగుతున్న గాలింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 05:04 PM