మంచిరేవులలో పాత రాతియుగం నాటి పనిముట్టు గుర్తింపు
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:20 PM
మంచిరేవుల బీరప్పగుడి గుట్ట మీద వేల ఏళ్లనాటి శిలా స్ఫటికాన్ని(క్వర్టజ్) గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ: మంచిరేవుల బీరప్పగుడి గుట్ట మీద వేల ఏళ్లనాటి శిలా స్ఫటికాన్ని(క్వర్టజ్) గుర్తించినట్లు కొత్త తెలంగాణ(Telangana) చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. అరుదైన రాయిని దార్వాడ్‌లోని కర్ణాటక యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి కొరిశెట్టార్ పరిశీలించిన అనంతరం అది క్రీ.పూ 40వేల నుంచి క్రీ.పూ పదివేల ఏళ్ల మధ్యకాలం నాటి ఆదిమానవులు వినియోగించిన రాతి పనిముట్టుగా నిర్ధారించారు.
మానవ పరిణామ క్రమంలో అత్యంత సుదీర్ఘమైన తొలిదశకు చెందిన పాతరాతి యుగంలో ఆదిమానవులు క్వర్టజ్, క్వార్ట్‌జెట్, చెర్ట్ రాళ్లతో వేటనిమిత్తం పనిముట్లు తయారు చేసుకున్నారని చరిత్ర చెబుతుంది. పాతరాతియుగం నాటి ఈ రాతి పని ముట్టు హైదరాబాద్‌లో లభించడం అరుదైన విషయమని క్టైమెట్ ఫ్రంట్ తెలంగాణ ఉపాధ్యక్షుడు మీర్ ఒమర్ అలీఖాన్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News