Share News

సనత్‌నగర్‌ టిమ్స్‌లో నిమ్స్‌ రోగులకు సర్జరీలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:45 AM

నిమ్స్‌లో సర్జరీల కోసం వెయిటింగ్‌లో ఉన్న రోగులకు సనత్‌నగర్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ టిమ్స్‌లో ఆపరేషన్లు నిర్వహించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు.

సనత్‌నగర్‌ టిమ్స్‌లో నిమ్స్‌ రోగులకు సర్జరీలు
Damodar Rajanarsimha

  • మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో సర్జరీల కోసం వెయిటింగ్‌లో ఉన్న రోగులకు సనత్‌నగర్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ టిమ్స్‌లో ఆపరేషన్లు నిర్వహించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో నిమ్స్‌లోని వివిధ విభాగాల అధిపతులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.


కొన్ని రకాల ఆపరేషన్ల కోసం పేషెంట్లు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని వారు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి సనత్‌నగర్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ టిమ్స్‌లో అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు, ఇతర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని నిమ్స్‌ వైద్యులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 06:45 AM