Share News

నిమ్స్‌లో 2000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌.. వైద్య బృందానికి సీఎం రేవంత్ అభినందనలు

ABN , Publish Date - May 22 , 2026 | 04:47 PM

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(NIMS) కిడ్నీ మార్పిడిలలో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది.

నిమ్స్‌లో 2000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌.. వైద్య బృందానికి సీఎం రేవంత్ అభినందనలు
NIMS Hyderabad

హైదరాబాద్, మే 22: కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(NIMS) కిడ్నీ మార్పిడి చికిత్సలో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌ పూర్తి చేసింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో దక్షిణ భారత దేశంలో నిమ్స్​ నంబర్ వన్‌గా నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో గుజరాత్‌లోని ఐకేడీఆర్‌సీ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో లూథియానా క్రిస్టియ‌న్ కాలేజీలో ఉండగా.. నిమ్స్ మూడో స్థానంలో నిలిచింది.


ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ 2,000 మందిలో 1,900 మంది అంటే 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవటం విశేషం. 2023 జనవరి నుంచి గడిచిన మూడేళ్ల నాలుగు నెలల్లోనే.. 500 కిడ్నీ మార్పిడిలు చేసి నిమ్స్ రికార్డు నెలకొల్పింది.


ఇవి కూడా చదవండి...

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్

అరటి తోటలో అగ్ని ప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 22 , 2026 | 05:01 PM