అరటి తోటలో అగ్ని ప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం
ABN , Publish Date - May 22 , 2026 | 04:15 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురంలో అరటి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. 11KV విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
జయశంకర్ భూపాలపల్లి, మే 22: చిట్యాల మండలం రామచంద్రాపురంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 11KV విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో అరటి తోటలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి పంట మొత్తం దగ్ధమైంది. అగ్ని ప్రమాదం రైతు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. సిరిపురం కుమారస్వామి అనే రైతుకు చెందిన 4 ఎకరాల అరటి తోట అగ్నికి ఆహుతైంది. దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చేతికి వచ్చే దశలో ఉన్న పంట కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరవుతున్న పరిస్థితి. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి...
బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీశ్ రావు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News