Share News

రేపే నీట్ పీజీ పరీక్ష.. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:21 PM

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం నెలకొంది. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యువతి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది.

రేపే నీట్ పీజీ పరీక్ష.. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
NEET PG student death

హైదరాబాద్, ఆగస్టు 29: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం నెలకొంది. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యువతి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. రేపే(ఆదివారం) నీట్ పీజీ పరీక్ష అనగా.. మనస్తాపంతో కర్నూలుకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత ప్రాణాలు తీసుకుంది. గత ఆరు నెలలుగా యువతి హైదరాబాద్‌లో ఉంటూ ‘నీట్ పీజీ’ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. మృతురాలు కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె.


సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థిని మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఒక్కగానొక్క కూతురు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరీక్షల మానసిక ఒత్తిడే యువతి ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యపై అధికారుల వివరణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 04:39 PM