మెడికల్ పీజీ స్టేట్ ర్యాంకులు విడుదల
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:50 AM
వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ (ఎండీ/ఎంఎ్‌స/డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్టేట్ ర్యాంకులను విడుదల చేసింది.
633 మార్కులు సాధించిన పల్లాక్షి ప్రసాద్
తాహా అమ్రీన్‌కు 607 మార్కులు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ (ఎండీ/ఎంఎ్‌స/డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్టేట్ ర్యాంకులను విడుదల చేసింది. నీట్ పీజీ-2026 అర్హత సాధించి, తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా నమోదు చేసుకున్న అభ్యర్థుల డేటాను యూనివర్సిటీ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రం నుంచి నీట్ పీజీ -2026కు హాజరైన మొత్తం 7,676 మంది అభ్యర్థుల సమాచారాన్ని ఈ జాబితాలో వెల్లడించింది.
అయితే, అర్హత సాధించిన విద్యార్థుల మార్కుల గణాంకాల్లో నీట్ పీజీలో 600 పైగా మార్కులను కేవలం ఇద్దరు అభ్యర్థులే సాధించారు. డాక్టర్ పల్లాక్షి ప్రసాద్ 633 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. అలాగే తాహా అమ్రీన్ 607 స్కోర్ చేసి జాతీయ స్థాయి 43వ ర్యాంకు సాధించినట్లు వర్సిటీ వెల్లడించింది. ఇక 599- 500 మధ్య స్కోర్ చేసిన వారు 504 మంది ఉండగా, 499-400 మధ్య మార్కులు సాధించిన వారు 1899 మంది, అలాగే 399-300 మధ్య స్కోర్ చేసిన వారు 3004 మంది, 200 మార్కులపైన స్కోర్ చేసిన వారు 2267 మంది ఉన్నట్లు వర్సిటీ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
పనిచేసి ఫలితం చూపించినవారికే ప్రజాదరణ
సీఎంఆర్ ధాన్యం దారిమళ్లింపు.. మిల్లు భాగస్వాములపై కేసు!
స్వచ్ఛంద సమాచార వెల్లడితో.. ఆర్టీఐ దరఖాస్తుల భారం తగ్గుతుంది!
Read Latest AP News And Telangana News And International News And Telugu News