Share News

నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన కారు

ABN , Publish Date - Sep 18 , 2026 | 08:24 PM

హైదరాబాద్ సమీపంలోని నార్సింగిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తూ అదుపుతప్పిన కారు.. డివైడర్‌ను ఢీ కొట్టి ఎదురుగా ఉన్న షాపుల్లోకి దూసుకెళ్లింది..

నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన కారు
accident in narsingi

హైదరాబాద్, సెప్టెంబర్ 18: నగర సమీపంలోని నార్సింగిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా ఉన్న షాపుల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. షాపులు ధ్వంసమై భారీ ఆస్తినష్టం సంభవించింది.


స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. నార్సింగి ప్రధాన రహదారిపై ఓ ఇన్నోవా కారు అతివేగంతో దూసుకెళ్లింది. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. ఎదురుగా ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. షాపులన్నీ ధ్వంసమయ్యాయి. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్

టీజీఎస్ ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా

For More TG News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 09:06 PM