Share News

మొయినాబాద్ నిందితుల కస్టడీ కోసం పిటిషన్.. తీర్పు వాయిదా

ABN , Publish Date - Mar 30 , 2026 | 06:52 PM

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు పైలెట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌లో పోలీసులు స్పష్టం చేశారు.

మొయినాబాద్ నిందితుల కస్టడీ కోసం పిటిషన్.. తీర్పు వాయిదా

హైదరాబాద్, మార్చి30: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు పైలెట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌లో పోలీసులు స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌‌ను సోమవారం విచారించిన కోర్టు.. తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే వీరిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఈ కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని విషయాలు రాబట్టేందుకు వీరిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


మార్చి 14న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మొయినాబాద్‌లోని తన ఫామ్ హౌస్‌లో తన స్నేహితులకు పార్టీ ఇవ్వాలనుకున్నారు. దీంతో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వి.శ్రవణ్ కుమార్, విజయకృష్ణ, రమేశ్, నమిత్ శర్మ, శరత్ కుమార్, కౌశిక్ రవితో పాటు ఓ మహిళ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ టీమ్‌కు సమాచారం అందింది. దీంతో వీరిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో ఫామ్ హౌస్‌కు చేరుకుంది టీమ్.


పార్టీలో మూడుసార్లు కాల్పుల శబ్దం వినిపించడంతో.. ఈగల్ టీమ్ అప్రమత్తమైంది. ఈ కాల్పులు జరిపిన నమిత్ శర్మను అదుపులోకి తీసుకుని.. తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. అలాగే ఈ కేసు విచారణలో మరికొంత మంది పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిందితులను మరోసారి కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను రేవంత్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా?: ఎమ్మెల్సీ విజయశాంతి

రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారు: సి.ఆర్.పాటిల్

For More TG News And Telugu News

Updated Date - Mar 30 , 2026 | 07:44 PM