రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారు: సి.ఆర్.పాటిల్
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:31 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ సోమవారం రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారని ఆయన మండిపడ్డారు.
న్యూఢిల్లీ, మార్చి30: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ సోమవారం రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ పైవిధంగా స్పందించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ (NDSA) నివేదికను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి సి.ఆర్.పాటిల్ ధ్వజమెత్తారు. రాష్ట్రం వద్ద రూ.873 కోట్లు ఉన్నా.. మూడేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.194 కోట్లేనని ఆయన గుర్తు చేశారు. మూడేళ్లుగా ఒక్క కొత్త స్కీమ్ ప్రతిపాదన కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి రాలేదని కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ పెదవి విరిచారు. మరోవైపు తెలంగాణకు చెందిన రాజ్యసభ్య సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐ చే విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ అత్తాపూర్‌లో అమానుషం... మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం..
కేజీ బంగారాన్ని సీజ్ చేసిన ఐటీ అధికారులు: విజయ్ కుమార్
For More TG News And Telugu News