Share News

హైదరాబాద్‌లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి మృతి

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:56 PM

హైదరాబాద్‌లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఉదంతం తీవ్ర విషాదాంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఒక బావిలో దూకి అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి మృతి
Hyderabad Student Missing Case

హైదరాబాద్‌: కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఒక బావిలో దూకి అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

సమాచారం ప్రకారం.. జగిత్యాల జిల్లా అయిలాపూర్‌కు చెందిన రాహుల్ హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఈ నెల మే 27న కాలేజీ సమీపంలో కొంతమంది సీనియర్ విద్యార్థులు అతడిని ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఘటన జరిగిన రోజే రాహుల్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


విద్యార్థి కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ బావిలో దూకి రాహుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ర్యాగింగ్ కారణంగానే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Also Read:

చేప మందు పంపిణీ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భద్రతను పరిశీలించిన సీపీ సజ్జనార్

ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి తుమ్మల

Updated Date - Jun 08 , 2026 | 01:06 PM