Share News

క్యాబ్ డ్రైవర్‌పై ‘ఛత్రపతి’ విలన్ సుప్రీత్ దాడి.. కేసు నమోదు

ABN , Publish Date - Jun 08 , 2026 | 10:57 AM

టాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘ఛత్రపతి’ సినిమాలో కాట్రాజ్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న సుప్రీత్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు.

క్యాబ్ డ్రైవర్‌పై ‘ఛత్రపతి’ విలన్ సుప్రీత్ దాడి.. కేసు నమోదు
Chatrapathi Villain

హైదరాబాద్, జూన్ 08: టాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘ఛత్రపతి’ సినిమాలో కాట్రాజ్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న సుప్రీత్ రెడ్డి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలో ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఆయన భౌతిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వనస్థలిపురం నుంచి కుందన్‌పల్లికి ప్రయాణికులను తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ శ్రీహరి.. వారిని అక్కడ దింపిన అనంతరం నాగారం సాయిబాబా ఆలయం సమీపంలో తన వాహనాన్ని నిలిపాడు. రోడ్డు పక్కన ఆగి, మరో బుకింగ్ కోసం అతడు వేచి చూస్తున్నాడు. అదే సమయంలో నటుడు సుప్రీత్ రెడ్డి తన ఫార్చునర్ కారులో ఆ మార్గంలో వచ్చారు. అయితే, రోడ్డుపై క్యాబ్ అడ్డంగా ఉందనే ఆగ్రహంతో సుప్రీత్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు.


ఈ క్రమంలోనే క్యాబ్ డ్రైవర్ శ్రీహరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బూతులు తిడుతూ చితకబాదినట్లు సమాచారం. బాధితుడు శ్రీహరి వెంటనే 'డయల్ 100' ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం శ్రీహరి కీసర పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నటుడు సుప్రీత్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి..

ట్రంప్ మాటల్ని పట్టించుకోని ఇజ్రాయెల్!.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు

నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 12:10 PM