Share News

పకడ్బందీగా ఆడుతున్నాం.. మళ్లీ గోల్‌ కొడతాం

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:30 AM

‘‘ప్రజల్లోకి ఎలా వెళ్లాలో, ఎన్నికల ఆట ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. ఆటను పకడ్బందీగా ఆడుతున్నాం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గోల్‌ కొడతాం..

పకడ్బందీగా ఆడుతున్నాం.. మళ్లీ గోల్‌ కొడతాం
Ponguleti Srinivas Reddy

  • వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావడం ఖాయం

  • డిజైనింగ్‌ లోపాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నది

  • చిట్‌చాట్‌ లో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజల్లోకి ఎలా వెళ్లాలో, ఎన్నికల ఆట ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. ఆటను పకడ్బందీగా ఆడుతున్నాం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గోల్‌ కొడతాం.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా పార్టీలో అంకితభావం కలిగిన నాయకులు, కార్యకర్తల బలమైన టీమ్‌ ఉంది. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎలాంటి రాజకీయ పోరాటం చేయాలో తమకు తెలుసని, సరైన సమయంలో సరైన వ్యూహంతో ముందుకెళ్లి రాజకీయంగా విజయం సాధిస్తామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రజలతో అనుబంధం, క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు, కార్యకర్తలే.. కాంగ్రె్‌సకు బలమని చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా ఎదుర్కోవడానికి సిద్థంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీకి చెప్పుకోదగిన రాజకీయ ఉనికి లేదని, ప్రస్తుతం ఉన్న 8 అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకోవడమే ఆ పార్టీకి పెద్ద సవాల్‌ అని పేర్కొన్నారు.


ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కేంద్రం నుంచి తగిన సహకారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, లోపభూయిష్టమైన డిజైన్లే ప్రధాన కారణమని పొంగులేటి ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన పునాది భద్రత విషయంలో శాస్ర్తీయ ప్రమాణాలను పక్కన పెట్టారని విమర్శించారు. పునాది భద్రత కోసం షీట్‌ఫైల్స్‌ వాడతామని డీపీఆర్‌లో పేర్కొని, దానికి భిన్నంగా సీకెంట్‌ ఫైల్స్‌ ఎందుకు వాడారో అప్పటి సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీకెంట్‌ ఫైల్స్‌ వల్లే బ్యారేజీ వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. దేశంలో ఏ బ్యారేజీని కూడా సీకెంట్‌ ఫైల్‌ పద్ధతిలో నిర్మించలేదని స్పష్టం చేశారు. నేషనల్‌ డ్యామ్‌ ేసఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రణాళిక, డిజైనింగ్‌, నిర్మాణ నాణ్యత, నిర్వహణలోని లోపాలు సమష్టిగా కారణమయ్యాయని వివరించారు. కాగా, హరీశ్‌రావు మామ హనుమంతరావు తప్పు చేయనప్పుడు సర్వేపై ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో ఎర్రవెల్లి, శివారు వెంకటాపూర్‌ గ్రామాల్లో సర్వే తుది దశకు చేరుకుందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 07:36 AM